AP: కృష్ణా జిల్లా తరిమిసలో వరకట్న వేధింపులు కలకలం రేపాయి. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని అదనపు కట్నం కోసం భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి కొంతకాలంగా వేధిస్తున్నారు. రాజీ పడి కాపురానికి వచ్చిన విజయలక్ష్మిపై, ఆమె తండ్రిపై కర్రలతో దాడి చేశారు. గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.