ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీరు తాగడం పూర్తిగా సురక్షితమని, ఇది నోటిలోని ఆమ్లాలను తగ్గించి pH స్థాయిని సమతుల్యం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులోని ఆమ్లాలు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. లాలాజలం పెరిగి దంతాలకు రక్షణ లభిస్తుంది. అయితే, బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగితే టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి, బ్రష్ చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల విరామం తర్వాతే నీళ్లు తాగడం మంచిదని సూచన. ఇది దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సురక్షితమైన అలవాటు.