వేసవిలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారిగా కూలింగ్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా, ఇది గొంతు నొప్పికి, తలనొప్పికి, అలసటకు దారితీస్తుంది. శరీర ఉష్ణోగ్రతలో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పేరుగుతుంది.