తాగునీటి కష్టాలు.. అనంతపురం జిల్లాలో ప్రజల ఆందోళన

19చూసినవారు
తాగునీటి కష్టాలు.. అనంతపురం జిల్లాలో ప్రజల ఆందోళన
AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజలు సోమవారం గాండ్లపెంట, గుడిబండ, కుందుర్పి మండలాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అప్పిలేపల్లి మహిళలు ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను నాలుగు గంటల పాటు అడ్డుకున్నారు. కటారుపల్లి గ్రామస్తులు కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై బైఠాయించారు.

సంబంధిత పోస్ట్