నేటి బిజీ జీవనశైలిలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిలబడి నీరు తాగడం వల్ల అది నేరుగా కడుపులోకి బలంగా ప్రవహించి, శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. మోకాళ్లు, కీళ్లలో నొప్పి, మూత్రపిండాల సమస్యలు, కడుపు నొప్పి వంటివి దీనివల్ల కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎల్లప్పుడూ కూర్చుని, నెమ్మదిగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.