రాష్ట్రానికి డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు మంజూరు

0చూసినవారు
రాష్ట్రానికి డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు మంజూరు
AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, 5 ప్రాంతీయ శిక్షణ కేంద్రాలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ప్రాంతీయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల శిక్షణ పూర్తి చేసుకుంటే.. రవాణా శాఖ కార్యాలయంలో పరీక్ష లేకుండా నేరుగా లైసెన్స్ అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్