వీధి వ్యాపారిపై డ్రోన్ దాడి.. వీడియో

11896చూసినవారు
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌లో వీధి వ్యాపారిపై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. డ్రోన్ దాడికి యత్నించడంతో సదరు వ్యాపారి తన వ్యాన్ చుట్టూ తిరుగుతూ తప్పించుకోవాలని చూశాడు. కానీ డ్రోన్ అతడిని వెంబడించి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. రష్యన్ డ్రోన్‌తో ఉద్దేశపూర్వకంగా కూరగాయల వ్యాపారిపై దాడి చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పౌరులను చంపుతూ రష్యా ఆనందపడుతోందని మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్