హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమిట్‌లో విద్యార్థులు, టెక్ సంస్థలు అద్భుత ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా టిహాన్ సంస్థ మనిషిని మోసుకెళ్లే డ్రోన్ (ఎయిర్ అంబులెన్స్)ను రూపొందించింది. ఇది అత్యవసర వైద్యం కోసం పేషెంట్లను త్వరగా ఆసుపత్రికి తరలించగలదు. నాగర్‌కర్నూల్ విద్యార్థి గణేశ్ చంద్ర సోలార్, బ్యాటరీ, పెడలింగ్‌తో నడిచే హైబ్రిడ్ సైకిల్‌ను తయారుచేశాడు. సంగారెడ్డి విద్యార్థులు ఇల్లు ఊడ్చి, బరువులు మోసే రోబోను, ఆదిలాబాద్ విద్యార్థినులు వ్యవసాయ పనులను సులభతరం చేసే మల్టీ పర్పస్ మెషిన్‌ను ప్రదర్శించారు.