AP: కృష్ణా జిల్లా గోశాల సెంటర్లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డుగా నిలబడి, రోడ్డుపై పడుకుని వీరంగం సృష్టించాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యువకుడు వెళ్లిపోవడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.