డ్రగ్స్ కేసు.. ఆ సమయంలో చనిపోవాలనుకున్నా: నటి హేమ

2012చూసినవారు
డ్రగ్స్ కేసు.. ఆ సమయంలో చనిపోవాలనుకున్నా: నటి హేమ
డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ నటి హేమ మరోసారి స్పందించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా కలచివేశాయని చెప్పారు. ఆ సమయంలో చనిపోవాలనిపించిందని, మానసికంగా కుంగిపోయానని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరికి నిర్దోషిగా బయటికి వచ్చానన్నారు. అయితే మీడియాలో వచ్చిన వార్తల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్