నెల రోజుల్లో DSC 2.0 నోటిఫికేషన్‌: మంత్రి లోకేశ్‌

10949చూసినవారు
నెల రోజుల్లో DSC 2.0 నోటిఫికేషన్‌: మంత్రి లోకేశ్‌
ఏపీలో నెల రోజుల్లో DSC 2.0 నోటిఫికేషన్‌ విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్‌ నుంచి పోస్టింగ్‌ ఆర్డర్ల వరకు ప్రతి దశలోనూ పారదర్శక ప్రక్రియ చేపట్టాలని సమీక్షలో సూచించారు. అలాగే పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్‌ మార్చ్‌’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబరులో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు లోకేశ్‌కు తెలిపారు.

సంబంధిత పోస్ట్