ఏపీ విద్యాశాఖ తాజాగా మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. జాబితాలో ఉన్నవారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. మెరిట్ జాబితా వివరాలను అధికారిక https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లోనే చూడాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా 'జోన్ ఆఫ్ కన్ఫిడరేషన్'లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందన్నారు.