డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందేందుకు పలువురు అభ్యర్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. ఇంత వరకూ 890 నకిలీ ధ్రువపత్రాలను అధికారులు గుర్తించారు. మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో 3 శాతం రిజర్వేషన్ కల్పించారు. దీంతో క్రీడా కోటా కింద 421 పీఈటీ పోస్టులు ఉన్నాయి. మెగా డీఎస్సీ అర్హత జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. క్రీడా కోటా కింద అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు.