ఏపీకి చెందిన డీఎస్పీ హర్షిత యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని (5,642 మీటర్లు) అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆమెను హోంమంత్రి అనిత అభినందించారు. డీఎస్పీ హర్షిత సాధించిన విజయం పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకమన్నారు. దృఢ సంకల్పం, నిరంతర కృషి, అసమాన పట్టుదలతో ఆమె ఈ విజయం సాధించారని అనిత అన్నారు.