దుబాయ్‌కి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్, తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్ ఉద్యోగులకు వివాహం, పిల్లలను ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వెల్లడించిన ఈ ఆఫర్ ప్రకారం, పెళ్లి చేసుకున్న వారికి రూ.12 లక్షలు, పిల్లలు పుట్టిన ప్రతిసారీ మరో రూ.12 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబాలు దేశానికి కీలకమని, పిల్లలు భవిష్యత్తుకు పెట్టుబడి అని ఆయన అన్నారు. గతంలోనూ యువకులను వివాహం చేసుకోవాలని ఆయన కోరారు.