AP: విశాఖపట్నం ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలు 30 ఏళ్లపాటు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 16 రాత్రి 10:45 గంటలకు ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E2018 విమానమే ఇక్కడి నుంచి చివరి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్‌గా నిలిచింది. ఇకపై ఈ విమానాశ్రయంలో సైనిక, పోలీస్, అత్యవసర, ప్రభుత్వ వీఐపీ, నాన్-షెడ్యూల్డ్ విమాన కార్యకలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీ లేక విశాఖ సివిల్ ఎన్‌క్లేవ్ వెలవెలబోయింది.