కారు బీభత్సం.. ఐదేళ్ల బాలుడు మృతి

463చూసినవారు
కారు బీభత్సం.. ఐదేళ్ల బాలుడు మృతి
AP: శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఎస్సీ కాలనీలో దసరా పండుగ సందర్భంగా విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బాలాజీ అనే వ్యక్తి కారును నడుపుతూ, బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను తొక్కడంతో కారు రెండు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు నిఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆదెమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you