AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పన కోసం కేంద్రంతో కలిసి పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో చేనేత క్లస్టర్లకు ఒక్కొక్క దానికి ఐదు కోట్లు, పచ్చళ్ళ తయారీ క్లస్టర్లకు 22 కోట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాలో పచ్చళ్ళ తయారీ క్లస్టర్ ద్వారా 2500 మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి లభించనుంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మిల్లెట్, సాంకేతిక, పర్యాటక, ఆహార ఉత్పత్తుల క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.