డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10వేల-రూ.లక్ష వరకు లోన్

22చూసినవారు
డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10వేల-రూ.లక్ష వరకు లోన్
ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాల కింద డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందించబడుతుంది. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా కుమార్తెల వివాహాల కోసం, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లల విద్యాభ్యాసం కోసం రుణాలు పొందవచ్చు. ఈ రుణాలను 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.