డ్వాక్రా మహిళలకు నెలకు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష

140చూసినవారు
డ్వాక్రా మహిళలకు నెలకు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష
AP: ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అరకు కాఫీ, చాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ బ్రాండ్ల సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు అద్భుతమైన స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సెంటర్ల ద్వారా డ్వాక్రా మహిళలు నెలకు రూ. 30,000 నుంచి రూ. 1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. పీఎంఈజీపీ (PMEGP) పథకంతో అనుసంధానం చేయడం ద్వారా సుమారు 35% వరకు రాయితీ లభిస్తుంది. ఆసక్తి గల డ్వాక్రా మహిళలు తమ జిల్లాల్లోని వెలుగు కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్