AP: డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని స్త్రీనిధితో అనుసంధానించినట్లు చెప్పారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు రుణంతో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, సామర్థ్యం ఉన్న మహిళలను గుర్తించి, రుణంతో పాటు వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు.