AP: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని DYFI నేతలు డిమాండ్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ‘ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడ?’ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా చౌక్ వద్ద నిరసనకారులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది.