మహీంద్రా కంపెనీ తమ వాహనాల్లో E20 పెట్రోల్ వాడకంపై స్పష్టత ఇచ్చింది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అన్ని మహీంద్రా వాహనాలు E20 పెట్రోల్‌తో పనిచేస్తాయని, 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేయబడతాయని తెలిపింది. 2025 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలు కూడా E20తో సురక్షితంగానే నడుస్తాయని, అయితే మైలేజీలో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొంది.