
ప్రజా దర్బార్ నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే
అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.





































