కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి, రెండు కుటుంబాలకు చెందిన 40 మేకలు, ఒక గేదె దూడ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై స్పందించి, రాజానగరం అసెంబ్లీ బిజెపి నాయకులతో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మంగళవారం బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ ఇప్పటికే వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారని కూడా ఆయన తెలిపారు.