కుతుకులూరులో ఉచిత వైద్య శిబిరం

0చూసినవారు
కుతుకులూరులో ఉచిత వైద్య శిబిరం
అనపర్తి మండలం కుతుకులూరులో సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్