తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. కొత్త ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్లపై వృద్ధులు, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.