రూ.12 కోట్లతో దేవరపల్లి మండలంలో అభివృద్ధి పనులు

4చూసినవారు
రూ.12 కోట్లతో దేవరపల్లి మండలంలో అభివృద్ధి పనులు
తన ఐదేళ్ల పదవీకాలంలో దేవరపల్లి మండల అభివృద్ధికి సుమారు రూ. 12 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మండల పరిషత్ అధ్యక్షుడు కేవీకే దుర్గారావు తెలిపారు. మండలంలోని రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ వసతులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం, పారిశుద్ధ్యం, సురక్షిత వాతావరణం, పిల్లలకు మెరుగైన అంగన్వాడీ వసతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్