రాజమండ్రిలో దీపావళి సందడి: కొనుగోళ్ల జోరుతో రహదారుల రద్దీ

780చూసినవారు
రాజమండ్రి నగరంలో దీపావళి పండుగ ముందుగానే సందడి నెలకొంది. మెయిన్ రోడ్డు, దేవి చౌక్, స్టేడియం రోడ్డు వంటి ప్రధాన సెంటర్లలో ప్రజలు కొనుగోళ్ల కోసం తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కొనుగోలుదారులతో రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది పండుగ సమయంలో వ్యాపారాలు జోరుగా సాగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు.