కొవ్వూరు పట్టణ ప్రధాన రహదారిలో గ్రామ సింహాలు (కుక్కలు) విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. రైతు బజార్ ఎదురుగా పదుల సంఖ్యలో గుమిగూడిన కుక్కలు అటుగా వెళ్లే వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగకముందే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.