తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో మెగా డీయస్సీ ద్వారా ముగ్గురు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు కొయ్యలమూడి తాతారావు, నాయకులు కలిసి సోమవారం నూతన ఉద్యోగులకు శాలువా కప్పి, వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ కరుటూరి శ్రీరామమూర్తి, ముళ్ళపూడి దొరాజీ, యలమాటి త్రినాథ్, ముళ్ళపూడి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.