ప్రమాదకరంగా కొవ్వూరుపాడు వంతెన

0చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సమీపంలోని కొవ్వూరుపాడు వద్ద ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతంలో ఉన్న ఈ కాజ్వే, కొద్దిపాటి వర్షానికే నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వంతెన ఎత్తు పెంచి, మరమ్మతులు చేపట్టి రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్