ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన కర్నూలులో నిర్వహించనున్న మహాసభకు సంబంధించిన ఏర్పాట్లను గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పర్యవేక్షించారు. లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొనే నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సభలో ఏఎమ్ సి చైర్మన్ బ్రహ్మరాజు కూడా పాల్గొన్నారు.