తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో, 20 సంవత్సరాలుగా లక్ష్మీపురం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. 2024 ఎన్నికల హామీ మేరకు, రూ. 2.57 కోట్ల వ్యయంతో లక్ష్మీపురం నుండి దేవరపల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యేకు లక్ష్మీపురం
జనసేన పార్టీ తరఫున ఆదివారం ఇంచార్జి సువర్ణరాజు ఆధ్వర్యంలో నాయకులు పోలుమాటి నాని, పోలుమాటి లక్ష్మణ్, మెంటిమి రాము, పాక మురారి, గౌతమ్ రాజు,
టీడీపీ బూత్ ఏజెంట్ దెయ్యాల సుమన్, సతీష్ కలిసి సన్మానం చేసి, చిన్న ఫ్రేమ్ అందజేశారు.