
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముప్పిడి
మొంథా తుఫాన్ కారణంగా వరద ముప్పు ఎదుర్కొంటున్న ప్రజల కోసం తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని అల్లూరి సూరన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మంగళవారం ఈ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ కల్పించిన సౌకర్యాలను, వైద్య పరికరాలను పరిశీలించి, అధికారులకు సూచనలు అందించారు.





































