చాగల్లు మండలం చాగల్లులో తెలగా సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం విఘ్నేశ్వర ఆలయ ప్రాంగణంలో భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 12, 000 మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షులు గండ్రోతు సురేంద్ర కుమార్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొని 71 సంవత్సరాలుగా ఉత్సవలను, అఖండ అన్న సమాధాన కార్యక్రమంలో నిర్వహిస్తున్న తెగ సంఘం ఉత్సవ కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జుట్టా కొండలరావు, ఎ సూర్యం, తెలగా సంఘం సభ్యలు పాల్గొన్నారు.