అరికిరేవులలో వర్షం నీరు నిలవకుండా ముమ్మరంగా పూడికతీత పనులు

6చూసినవారు
అరికిరేవులలో వర్షం నీరు నిలవకుండా ముమ్మరంగా పూడికతీత పనులు
కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసినట్లు పంచాయతీ సెక్రటరీ కె. సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఎక్కడా వర్షం నీరు నిలవకుండా పంచాయతీ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు డ్రైనేజీల్లో పూడిక తీత పనులు చేపడుతున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని సెక్రటరీ పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు మరింత వేగవంతం చేశామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్