విద్యా సంస్థలు జైళ్లను తలపిస్తున్నాయి: మేడా శ్రీనివాస్

831చూసినవారు
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆదివారం రాజమండ్రిలో మాట్లాడుతూ, పలు విద్యా సంస్థలు జైళ్లను తలపిస్తున్నాయని అన్నారు. జైళ్లలో ఖైదీలకు లభించే హక్కులు కూడా విద్యార్థులకు లభించడం లేదని, సరైన అక్షర జ్ఞానం లేని సినిమా హీరోలతో ర్యాంకుల కోసం ప్రచార ప్రకటనలు చేయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యా మాఫియాకు వరంలా మారాయని విమర్శించిన ఆయన, అర్హత లేని విద్యా సంస్థలను రద్దు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్