కొవ్వూరు మండలం మద్దూరులంక మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు కంచుమర్తి వెంకట్రావు ఆదివారం మృతి చెందారు. ఆయన పార్థీవ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు
వైసీపీ ఇన్చార్జ్ తలారి వెంకట్రావు సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకట్రావు మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.