ఐ.పంగిడిలో రూ. 50 వేలు పలికిన గణనాథుని లడ్డు

781చూసినవారు
ఐ.పంగిడిలో రూ. 50 వేలు పలికిన గణనాథుని లడ్డు
కొవ్వూరు మండలం ఐ పంగిడి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న స్వామివారి లడ్డు ప్రసాదం వేలం పాటలో రూ. 50 వేలు పలికింది. గ్రామానికి చెందిన కారంపూడి పోసిరావు అత్యధిక మొత్తానికి ఈ లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భాజాభజంత్రీలు, మేళతాళాల నడుమన లడ్డు ప్రసాదాన్ని ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

సంబంధిత పోస్ట్