అభివృద్ధి పనులకు కొవ్వూరు ఎమ్మెల్యే శంఖస్థాపన

2చూసినవారు
అభివృద్ధి పనులకు కొవ్వూరు ఎమ్మెల్యే శంఖస్థాపన
రాష్ట్రంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో రూ. 50 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ఆధునిక మౌలిక వసతులతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి , కంఠమణి రామకృష్ణ మద్దిపట్ల శివరామ కృష్ణ, మున్సిపాల్ కమిషనర్ మరియు NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్