ఆరోగ్యకరమైన కొవ్వూరు కోసం పని చేద్దాం: ఎమ్మెల్యే ముప్పిడి

875చూసినవారు
ఆరోగ్యకరమైన కొవ్వూరు కోసం పని చేద్దాం: ఎమ్మెల్యే ముప్పిడి
స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద శనివారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. పరిశుభ్రమైన కొవ్వూరు. ఆరోగ్యకరమైన కొవ్వూరు కోసం ప్రజలు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపని చిన్ని, అర్జిల్లి రామకృష్ణ, సూర్యదేవర రంజిత్, బర్ల శ్రీను, మున్సిపల్ కమిషనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్