బీసీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే అది రెడ్డి ఆకస్మిక తనిఖీ

528చూసినవారు
రాజమండ్రి సిటీ గణేష్ చౌక్ లోని బీసీ బాలికల వసతి గృహాన్ని సిటీ ఎమ్మెల్యే అది రెడ్డి శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి వసతి గృహ ఆవరణలో పర్యటించి, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్