కాకినాడ జిల్లా పరిషత్ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పెదపూడి మండల రైతులు తమ CMR ధాన్యాన్ని బిక్కవోలు మండలంలోని రైస్ మిల్లులకు అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉన్నప్పటికీ, CMR ధాన్యం అమ్మకాలకు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.