తాళ్లపూడి మండలం మలకపల్లిలోని పీహెచ్‌సీ వద్ద జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.