చింతపల్లి సతీష్ కుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే ముప్పిడి

0చూసినవారు
చింతపల్లి సతీష్ కుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే ముప్పిడి
కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ చింతపల్లి సతీష్ కుమార్ ఇటీవల గుండెపోటుకు గురై స్టెంట్ వేయించుకున్న విషయం తెలుసుకున్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టూ-మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్