కొవ్వూరు మండలం చాగల్లులో గురువారం
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాటమ్మ పేటలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ళ హరిబాబు, ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల నాని పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో కొత్త పింఛన్ల పరిశీలన అనంతరం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంగ రామకృష్ణ, శెట్టి ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.