చాగల్లు లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

0చూసినవారు
చాగల్లు లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, చాగల్లు మండలం చాగల్లులో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆళ్ళ హరిబాబు, ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల నాని పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన అందరికీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. త్వరలో నూతన పెన్షన్ల పరిశీలన అనంతరం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామకృష్ణ, శెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్