పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: అన్నదానం, కేక్ కటింగ్ తో ఘనంగా నిర్వహణ

1చూసినవారు
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: అన్నదానం, కేక్ కటింగ్ తో ఘనంగా నిర్వహణ
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐపంగిడిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో జనసేన నాయకుడు చౌటుపల్లి శివ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులకు అన్నదానం చేశారు. అనంతరం విద్యార్థులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చౌటుపల్లి శివ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వెండితెరపై స్టార్‌డమ్‌తో పాటు ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించారని అన్నారు.

సంబంధిత పోస్ట్