కొవ్వూరులో పడకేసిన పారిశుద్ధ్యం

1చూసినవారు
కొవ్వూరులో పడకేసిన పారిశుద్ధ్యం
కొవ్వూరు అచ్చయమ్మ కాలనీ డంపింగ్ యార్డుగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్త పేరుకుపోవడం, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత, ఒకవైపు పాలకవర్గం లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికారులు స్పందించి సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్